గీతం యూనివర్సిటీకి నేషనల్​ రీసెర్చ్​ ఫౌండేషన్ ప్రాజెక్టు

గీతం యూనివర్సిటీకి నేషనల్​ రీసెర్చ్​ ఫౌండేషన్ ప్రాజెక్టు

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​యూనివర్సిటీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. డిపార్టుమెంట్ ఆఫ్​ సైన్స్​అండ్ టెక్నాలజీకి చెందిన అనుసంధాన్​ నేషనల్​రీసెర్చ్​ఫౌండేషన్ గీతం స్కూల్​ ఆఫ్ సైన్స్​ ప్రిన్సిపల్​డాక్టర్​ మోతాహర్​ రెజాకు పరిశోధనా ప్రాజెక్టును రీలీజ్​చేస్తూ మంగళవారం ఆర్డర్లు అందించింది.

ప్రవాహ అస్థిరతలను అధ్యయనం చేయడానికి, మైక్రోడొమైన్​, మైక్రోఫ్లూయిడిక్స్​పై లోతైన పరిశోధనలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అందజేసినట్లుగా రెజా తెలిపారు. ఈ ప్రాజెక్టుతో సైన్స్​అండ్ టెక్నాలజీ రంగంలో ఆధునిక పరిశోధనలు, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లే అవకాశం దక్కిందని, నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ ప్రాజెక్టులో జూనియర్​ రీసెర్చ్​ఫెలో అవసరమని ఎంటెక్​, ఎమ్మెస్సీ మ్యాథ్స్​ పూర్తి చేసి మ్యాట్ ల్యాబ్​ ప్రోగ్రామింగ్​లో ప్రావీణ్యం ఉన్న వారు అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాధించిన డాక్టర్ రెజాను గీతం వీసీ ప్రొఫెసర్​ డీఎస్​రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్​ వర్మ, వివిధ విభాగాల డైరెక్టర్లు, హెచ్​ఓడీలు అభినందించారు.